అనూష కుటుంబానికి ప్రభుత్వం అండదండలు | Sakshi
Sakshi News home page

అనూష కుటుంబానికి ప్రభుత్వం అండదండలు

Published Thu, Mar 4 2021 4:25 AM

AP Govt Support To Anusha family - Sakshi

ముప్పాళ్ల (సత్తెనపల్లి): డిగ్రీ విద్యార్థిని కోట అనూష కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో అనూష తల్లిదండ్రులను ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో కలిసి ఆయన బుధవారం పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఎంపీ మాట్లాడుతూ అనూషను హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టాన్ని తెచ్చారని వివరించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా రూ.10 లక్షల చెక్కును తల్లిదండ్రులకు అందించారు. బాధితులు కోరుకున్న విధంగానే నరసరావుపేటలో ఇంటిస్థలం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement