
తాడేపల్లి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. ఈ సందర్బంగా నారా లోకేష్ బూతుపురాణం గురించి దత్తపుత్రుడి ఓవర్ యాక్షన్ గురించి ఆయన ప్రస్తావించారు. వారిద్దరూ శాంతికి భగ్నం కలిగించే ప్రయత్నం చేశారు కాబట్టే తాను మాట్లాడవలసి వస్తోందన్నారు.
ఆదివారం సాయంత్రం ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా అవినీతిమయమేనని, ఈ స్కీముకు దర్శకత్వం, రూపకర్త అంతా చంద్రబాబేనన్నారు. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్రపై పూర్తి ఆధారాలున్నాయని కోర్టు వాటినన్నిటిని పరిగణనలోకి తీసుకునే తీర్పునిచ్చిందని అన్నారు.
ఇక నిన్నటి నుంచి నారా లోకేష్, దత్తపుత్రుడు ఇద్దరూ శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించారని చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. వాళ్ళు హుందాగా ప్రవర్తించి ఉంటే మేము మాట్లాడాల్సి వచ్చేది కాదని రాత్రి పవన్ కళ్యాణ్ అయితే చాలా ఓవర్ యాక్షన్ చేశారన్నారు. మరోపక్క నారా లోకేష్ బూతు పురాణం మొదలు పెట్టాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పు చేస్తే ఎంతటి పెద్ద వారికైనా న్యాయపరమైన శిక్షలు తప్పవు. చట్టాలను, న్యాయవ్యవస్థను మనం గౌరవించాలని అన్నారు.
ఇది కూడా చదవండి: ఇక జైలుకే.. ఏసీబీ కోర్టులో బాబుకు షాక్..