ఏపీలో తాజాగా 11,434 కరోనా కేసులు నమోదు.. | AP Government Released Bulletin Coronavirus | Sakshi
Sakshi News home page

ఏపీలో తాజాగా 11,434 కరోనా కేసులు నమోదు..

Apr 27 2021 8:44 PM | Updated on Apr 27 2021 8:47 PM

AP Government Released Bulletin Coronavirus - Sakshi

అమరావతి: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 74,435 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,434 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన  ఏపీలో 64 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 7,055 మంది క్షేమంగా కొలుకున్నారు.  ఇప్పటి వరకు ఏపీలో మొత్తంగా..  9 లక్షల 47 వేల 629 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 99,446 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,61,43,083 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. 

గత 24 గంటల్లో ఏపీలో జిల్లాలవారీగా నమోదైన కరోనా కేసులు
శ్రీకాకుళం-1322, విజయనగరం-633, విశాఖ-1067 కేసులు,తూ.గో- 253, ప.గో -424, కృష్ణా -544, గుంటూరు-2028 కేసులు, ప్రకాశం - 497, నెల్లూరు -1237, చిత్తూరు - 1982 కేసులు,అనంతపురం-702, కర్నూలు-474, వైఎస్ఆర్ కడప జిల్లా - 271 కేసులు నమోదయ్యియి.

చదవండి: స్వల్ప లక్షణాలున్న బాధితులకు కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స

Advertisement
 
Advertisement
Advertisement