ఏపీ: ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్‌ జారీ | AP Government Issue Ordinance On Employees Retairement Age Raise | Sakshi
Sakshi News home page

ఏపీ: ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్‌ జారీ

Jan 31 2022 3:30 PM | Updated on Jan 31 2022 9:32 PM

AP Government Issue Ordinance On Employees Retairement Age Raise - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. 2022 జనవరి 1నుంచి ఈ ఉత్వర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ సోమవారం సంతకం చేశారు.

కాగా ఇటీవల  ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిని మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ సంతకం చేశారు. 
చదవండి: కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు: మంత్రి బొత్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement