Kurnool: గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్‌.. షెడ్యూల్‌ ఇదే..

AP CM YS Jagan Mohan Reddy Visiting Kurnool on 17th May - Sakshi

17న సీఎం వైఎస్‌ జగన్‌ జిల్లాకు రాక 

గుమ్మటం తండాలో ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరు

సాక్షి, కర్నూలు (సెంట్రల్‌): సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17న జిల్లాకు రానున్నారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండాలో పర్యటించనున్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.  

చదవండి: (Konaseema: ఆటే శ్వాస... సాధనే జీవితం.. ఫైనల్స్‌కు చేరిన భారత జట్టులో)

సీఎం పర్యటన వివరాలు.. 
►మంగళవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడలోని ఆయన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. 
►10 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. 
►10.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
►11.15 గంటలకు ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా హెలిప్యాడ్‌కు హెలికాప్టర్‌లో వస్తారు. 
►11.15 నుంచి 11.30 గంటల మధ్య స్థానిక నేతలతో మాట్లాడతారు. 
►11.35 గంటలకు ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. 
►11.35 నుంచి 12.15 గంటలకు ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు  
►12.40 గంటలకు తిరిగి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు 
►12.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు.     

చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌ )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top