కొత్త వర్సిటీల ఏర్పాటుకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

AP CM YS Jagan Mohan Reddy Gave Green Signal To New Univesity Establish - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వర్సిటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గ్రీన్‌ సిగ‍్నల్‌ ఇచ్చారు. ప్రకాశం, విజయనగరంలో జిల్లాల్లో కొత్త యూనివర్శిటీలకు, సాలూరులో కేంద్ర గిరిజన యూనివర్శిటీల ఏర్పాటుకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అరకులో రాష్ట్ర గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు కర్నూలులో క్లస్టర్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు కూడా సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కడపలో ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీ ఏర్పాటుపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటుపై కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది నుంచే పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top