ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్‌ | AP CM YS Jagan extends greetings to all teachers on Teacher's day - Sakshi
Sakshi News home page

టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.. సర్వేపల్లికి సీఎం జగన్‌ నివాళి

Published Tue, Sep 5 2023 9:03 AM

AP CM YS Jagan Extends Teachers Day greetings to all the teachers - Sakshi

సాక్షి, గుంటూరు: ఇవాళ(సెప్టెంబర్‌ 5న) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు లండన్‌ పర్యటనలో ఉన్న ఆయన తన ట్విటర్‌(ఎక్స్‌) ద్వారా టీచర్స్‌ డే సందేశం ఉంచారు.

‘‘భవిష్యత్ తరాలను సమున్నతంగా తీర్చిదిద్దడంలో టీచర్లు నిర్వర్తిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను అమలు చేస్తూ.. ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా మన పేదింటి పిల్లలను సుశిక్షితులుగా తయారు చేయడంలో.. ధృడసంకల్పంతో కృషి చేస్తున్న టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు. 

ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా నివాళులు అని ట్వీట్‌ చేశారాయన. 

Advertisement
 
Advertisement
 
Advertisement