ఏపీకి ఆరు అవార్డులు.. సీఎం జగన్‌ హర్షం | AP Bagged Six Prestigious Awards One District One Product Program | Sakshi
Sakshi News home page

ఏపీకి ఆరు అవార్డులు.. సీఎం జగన్‌ హర్షం

Jan 31 2024 7:23 PM | Updated on Jan 31 2024 7:34 PM

AP Bagged Six Prestigious Awards One District One Product Program - Sakshi

సాక్షి, అమరావతి: వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ప్రోడక్ట్‌(ఓడీఓపీ)లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. కేంద్రం చేపట్టిన ఓడీఓపీలో ఒక్క ఏపీకే ఆరు అవార్డులు రావటంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ అభినంధించారు.

కాకినాడ జిల్లా ఉప్పాడ జామ్దాని చీరలు, అరకు కాఫీకి బంగారు పతకాలు వచ్చాయి. పొందూరు కాటన్‌, కోడుమూరు గద్వాల్‌ చీరలకు కాంస్య పతకాలు లభించాయి. అదేవిధంగా మదనపల్లె పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు వచ్చాయి.

ఇక.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్(ఓడీఓపీ) కార్యక్రమం... ప్రత్యేకించి చేతివృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమం కళాకారుల జీవనోపాధిని కూడా కాపాడి.. ఉపాధి అవకాశాలను కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement