
అదేరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ
రేపు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) బడ్జెట్‌ను ఈ నెల 28న కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అదేరోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది.
అనంతరం రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025–26 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.