అన్నమాచార్య ప్రాజెక్ట్ రూపకర్త కన్నుమూత | Annamacharya Founder Kamisetty Srinivasulu Died | Sakshi
Sakshi News home page

అన్నమాచార్య ప్రాజెక్ట్ రూపకర్త కన్నుమూత

Sep 19 2020 9:49 PM | Updated on Sep 19 2020 9:57 PM

Annamacharya Founder Kamisetty Srinivasulu Died - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: అన్నమాచార్య ప్రాజెక్టు వ్యవస్థాపక సంచాలకులు కామిశెట్టి శ్రీనివాసులు శనివారం కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన డాక్టర్ కామిశెట్టి శ్రీనివాసులు, అన్నమాచార్య కీర్తనలపై విశేష పరిశోధనలు చేశారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు తొలి సంచాలకులుగా కామిశెట్టి పని చేశారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ తొలి డైరెక్టర్‌గా కూడా కామిశెట్టి సేవలంధించారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారితో శ్రీ వెంకటేశ్వర పంచరత్న మాలికను కామిశెట్టి శ్రీనివాసులు రూపొందించారు. మరోవైపు అమెరికాలో అన్నమయ్య కీర్తనలకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించడంలో కామిశెట్టి శ్రీనివాసులు ఎంతో కృషి చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement