AP: రెండో శనివారం బడులు, కాలేజీలకు పనిదినమే

Andhra Pradesh: Schools, Colleges to function on August 13 - Sakshi

ఆజాదీ కా అమృతోత్సవాల సన్నాహాల కోసం 

సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృతోత్సవాలను ఈనెల 15న ఘనంగా నిర్వహించడానికి, విద్యార్థులందరి భాగస్వామ్యాన్ని పెంచడానికి  సన్నాహ కార్యక్రమాల కోసం ఈనెల 13వ తేదీ రెండో శనివారాన్ని పనిదినంగా పరిగణిస్తూ పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ సర్క్యులర్లు విడుదల చేశాయి.

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 15న పెద్ద ఎత్తున సంబరాన్ని నిర్వ హించడానికి ఆజాదీ కా అమృతోత్సవాల పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమా లను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం నుంచి హర్‌ ఘర్‌ జెండా కార్యక్రమం చేపట్టారు. పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. 13, 14 తేదీలు రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలుగా ఉండడంతో సన్నాహక కార్యక్రమాలకు ఆటంకంగా మారింది.

విద్యార్థులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రిహార్సల్స్‌ వంటివి చేయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండో శనివారం సెలవు దినాన్ని పనిదినంగా కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ కమిషనర్లు ఎస్‌.సురేష్‌కుమార్, ఎం.వి.శేషగిరిబాబు సర్క్యులర్లు విడుదల చేశారు. జూనియర్‌ కాలేజీలకు రెండో శనివారానికి బదులు మూడో శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించాలని ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌.. రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్లకు సూచించారు. (క్లిక్: మార్పును పట్టుకుందాం)  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top