ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు | Andhra Pradesh Rajya Sabha name Confirmed | Sakshi
Sakshi News home page

ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు

Apr 28 2025 7:25 PM | Updated on Apr 28 2025 9:22 PM

Andhra Pradesh Rajya Sabha name Confirmed

అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు అయ్యారు. బీజేపీ నేత, భీమవరానికి చెందిన పాక వెంకటసత్యనారాయణ(Paka Venkata Satyanarayana)ను ఎంపిక చేసింది ఆ పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.  కూటమి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్‌ వేయబోతునున్నారు. 

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. తొలుత తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్‌ అన్నామలైకు అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరిగింది. చివరకు ఏపీ నేతకే ఆ అవకాశం దక్కింది. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా ఉన్నారు పాక వెంకటసత్యనారాయణ. గతంలో భీమవరం కౌన్సిలర్‌గా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారీయన.

Advertisement
 
Advertisement
Advertisement