ఏపీ: గవర్నర్‌తో సీఎం జగన్‌ దంపతుల మర్యాదపూర్వక భేటీ

Andhra Pradesh: CM YS Jagan Meet Governor Biswa Bhusan June 2022 - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు కలిశారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌ దంపతులను..  సతీసమేతంగా సీఎం జగన్ కలిశారు.

రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌, సతీమణి వైఎస్‌ భారతిరెడ్డికి.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. ఆపై సీఎం జగన్‌ సతీసమేతంగా గవర్నర్‌ దంపతులను సత్కరించారు. ఆపై దాదాపు గంట సేపు గవర్నర్, సీఎం జగన్‌ ఏకాంతంగా సమావేశం అయ్యారు. 

ఈ భేటీలో సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి.. సీఎం జగన్‌, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వివరించినట్లు సమాచారం.

అమరావతిలో రూ.40 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో టీటీడీ నిర్మించిన, ఆలయ ప్రాణ ప్రతిష్టకు రావాల్సిందిగా గవర్నర్‌‌ను సీఎం జగన్ ఆహ్వానించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు, ఆ సందర్భంలో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ప‌లు కీల‌క బిల్లుల‌పైనా గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం జ‌గ‌న్ చ‌ర్చించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top