
న్యూఢిల్లీ: ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిలను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న కుంతియా స్థానంలో మాణిక్యం ఠాగూర్‌ను అధిష్ఠానం నియమించింది. ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఊమెన్‌చాందీ నియమితులయ్యారు. జనరల్ సెక్రటరీ పదవి నుంచి గులాబ్ నబీ ఆజాద్‌ను తొలగించింది.
కాగా సీడబ్ల్యూసీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ వ్యవహారాల నిర్వహణలో భాగంగా అధ్యక్షురాలికి సహాయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణదీప్ సుర్జేవాలా తదితరులు ఉన్నారు.