16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్‌! మన తెనాలి కుర్రాడే.. | Sakshi
Sakshi News home page

16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్‌! మన తెనాలి కుర్రాడే..

Published Sun, May 19 2024 5:42 AM

An AI engineer at the age of 16

పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్‌ అరుదైన ప్రతిభ 

ఐఐటీ ఏఐ సెంటర్‌కు ఎంపిక 

తెనాలి: తెనాలికి చెందిన 16 ఏళ్ల పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్‌ చిరు ప్రాయంలోనే ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్‌ ఇంజనీర్‌గా అరుదైన ప్రతిభ సాధించాడు. అయితే గతంలోనే ఇతడు ఆసియాలోనే అతి పిన్నవయసు డేటా సైంటిస్ట్‌గా గుర్తింపు పొందాడు. హైదరాబాద్‌ ఐఐటీలో కొత్త­గా ప్రారంభించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో బాధ్యతలు స్వీకరించాడు. గుంటూ­రు జిల్లా తెనాలికి చెందిన  ప్రియమానస, రాజ్‌కుమార్‌ దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ. చిన్నతనం నుంచి కంప్యూటర్‌పై మక్కువ చూపడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నాలుగో తరగతి నుంచే కంప్యూటర్‌ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్‌ నేర్చుకున్నా­డు. 

నాలుగైదేళ్లు గడిచేసరికి అడ్వాన్స్‌ లెవెల్‌కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్‌లైన్‌లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేస్తూ, ఆన్‌లైన్‌ కోర్సులతో  సిద్ధార్థ వాటిపై పట్టు సాధించాడు. మోంటెగ్న్‌ కంపెనీ సీఈవో సిద్ధార్థకు ఉద్యోగానికి ఆఫర్‌ చేశారు. ఆవిధంగా ఏడో తరగతిలో ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల వేతనంతో చేరాడు. తర్వాత ఇనిఫినిటీ లెర్న్‌ అనే సంస్థలో డేటా సైంటిస్ట్‌గా నెలకు రూ.45 వేల వేతనం అందుకుంటూ, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్‌లో వినూత్న గేమ్‌ డిజైనింగ్‌లో కృషిచేస్తున్నాడు. వారంలో మూడురోజులు పాఠశాలకు, మూడురోజులు ‘ఇన్‌ఫినిటీ లెర్న్‌’ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేస్తూనే, అమెరికన్‌ కంపెనీ ‘రైట్‌ ఛాయిస్‌’ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్‌ క్లాసులు నిర్వహించాడీ బాలమేధావి.

మార్చిలో జూనియర్‌ ఇంటర్‌ పూర్తిచేసి­న సిద్ధార్థను బైజూస్‌ కంపెనీ ‘యంగ్‌ జీనియస్‌’ అవా­ర్డుతో సత్కరించింది. ‘సాక్షి’ ఎక్సలెన్స్‌ అవార్డును అందుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి భూకంపాలను ముందుగానే గుర్తించడమనే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుకూ పనిచేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఐఐటీ కొత్తగా  ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని ఆరంభించింది. గత వారం నిర్వహించిన ఇంటర్వ్యూలో  మెషీన్‌ లెరి్నంగ్‌ ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్‌ ఇంజినీరుగా సిద్ధార్థకు అవకాశం కల్పించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement