గణేశ నిమజ్జనాల్లో ఐదుగురు గల్లంతు | 3 killed in accidents during Ganesh immersion: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గణేశ నిమజ్జనాల్లో ఐదుగురు గల్లంతు

Sep 10 2024 5:31 AM | Updated on Sep 10 2024 5:32 AM

3 killed in accidents during Ganesh immersion: Andhra Pradesh

ముగ్గురు కన్నుమూత, ఒకరు సురక్షితం 

మరో వ్యక్తి కోసం గాలింపు

తిరుపతి, వైఎస్సార్‌ జిల్లాల్లో ఘటనలు

వాకాడు/వీరపునాయునిపల్లె: వినాయక ప్రతిమల నిమజ్జన కార్యక్రమంలో ఐదుగురు గల్లంతైన ఘటనలు తిరుపతి, వైఎస్సార్‌ జిల్లాల్లో సోమవారం జరిగాయి. వీరిలో ముగ్గురు మృత్యువాత పడగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మరో వ్యక్తి ఆచూకీ లభించలేదు. వివరాల్లోకి వెళితే... తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం బీచ్‌కి నాయుడుపేట మారయ్య, కావమ్మ గుడి ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది యువకులు వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చారు.

తీరంలో స్నానాలు చేస్తున్న క్రమంలో మునిరాజ, ఫయాజ్, శ్రీనివాసులు అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. గమనించిన పోలీసులు శ్రీనివాసులు, ఫయాజ్‌లను ఒడ్డుకు చేర్చారు. శ్రీనివాసులు ప్రాణాలతో బయట పడగా, ఫయాజ్‌(22) వాకాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మునిరాజ ఆచూకీ తెలియరాలేదు. 

ఐదు గంటల తర్వాత మృతదేహాల వెలికితీత 
వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె పట్టణానికి చెందిన పలువురు తమ వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేసేందుకు వీరపునాయునిపల్లె మండలంలోని ఎన్‌.పాలగిరి క్రాస్‌ వద్ద ఉన్న మొగమూరు వాగు వద్దకు వచ్చారు. వినాయకుడి ప్రతిమను నీటిలోకి వదులుతున్న సమయంలో వంశీ(25), రాజా(40) వాగులో పడిపోయారు. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐ మంజునాథ్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వెలికితీసే కార్యక్రమం చేపట్టారు. ఫలితం లేకపోవడంతో పులివెందుల నుంచి ఫైర్‌ సిబ్బందిని పిలిపించి స్థానికుల సహకారంతో ఐదు గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు. 

వేర్వేరు ఘటనల్లో మరో ముగ్గురు మృతి 
వైఎస్సార్‌ జిల్లా చక్రాయపేట మండలంలో ట్రాక్టర్‌ కింద పడి గౌతమ్‌(17), అన్నమయ్య జిల్లా పాపేపల్లె పంచాయతీలో ట్రాక్టర్‌ చెరువులో పడి అప్ఙల్‌(11), దుద్యాల గ్రామంలో గుండెపోటుతో ఉప్పు సుబ్బరామయ్య (54) మృతి చెందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement