ఏపీలో మరో 3 రోజులపాటు వర్షాలు | 3 Days Of Thunder Storm Rainfall In Rayalaseema And Coastal Andhra | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో 3 రోజులపాటు వర్షాలు

Aug 17 2020 6:05 PM | Updated on Aug 17 2020 6:29 PM

3 Days Of Thunder Storm Rainfall In Rayalaseema And Coastal Andhra - Sakshi

సాక్షి, అమరావతి: తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్‌ జోన్  20 °N  అక్షాంశం వెంబడి సెంట్రల్ ఇండియా మీదుగా ఉపరితల ద్రోణి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని ఏపీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉండటం వల్ల ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగష్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తదుపరి 42 గంటల్లో ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వాతావరణ సూచన
తూర్పు-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజులు(మంగళవారం, బుధవారం) ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు చాలా చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో చాల చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement