ఆరోగ్య శ్రీలో 16.47 లక్షల మందికి లబ్ధి  | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శ్రీలో 16.47 లక్షల మందికి లబ్ధి 

Published Thu, Mar 16 2023 4:09 AM

16.47 lakh people benefited in Arogya Sri - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా గత డిసెంబర్‌ వరకు 16,47,782 మందికి లబ్ధి చేకూరింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,999.66 కోట్లు వ్యయం చేసింది. కోవిడ్‌–19 చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి.. 2,14,135 మందికి రూ.743.22 కోట్లతో ఉచిత చికిత్స అందించింది.

ఈ పథకం కింద చికిత్స అనంతరం కోలుకునే సమయంలో రోగుల జీవనోపాధి కోసం వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద గత డిసెంబర్‌ ఆఖరు వరకు 17,06,023 మందికి రూ.903.90 కోట్లు సాయంగా అందజేసింది. ఈ విషయాలను 2022–23 రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడించింది.

ఈ ప్రభుత్వం వచ్చాక 108 అంబులెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేసి, కొత్తగా 432 అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. 108 అంబులెన్స్‌ల ద్వారా 2021 జూలై నుంచి 2022 డిసెంబర్‌ వరకు అత్యవసర వైద్యం అవసరమైన 27,00,942 మందిని ఆస్పత్రులకు తరలించింది. ఇందులో 2,54,609 కోవిడ్‌ కేసులు కాగా, మిగతా 24,46,333 నాన్‌ కోవిడ్‌ కేసులు. 

 
Advertisement
 
Advertisement