అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్‌.. 14 మందిని సస్పెండ్‌ చేసిన స్పీకర్‌

14 TDP MLAs Suspended For One Day In AP Assembly Budget Session - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఓవరాక్షన్‌ చేశారు. బడ్జెట్‌ ప్రవేశపెడుతుండగా ఆందోళన చేపట్టారు. స్పీకర్‌ పోడియంపై పేపర్లు విసిరారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు సీఎం సిఫార్సు చేశారు. బడ్జెట్‌ ప్రసంగానికి అడ్డు తగలడంతో టీడీపీ నేతలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. 14 మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

కాగా అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్తో 2023,24 వార్షిక బడ్జెట్‌ రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లు.. మూలధన వ్యయం రూ. 31,061 కోట్లుగా పేర్కొన్నారు. 

చదవండి: రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top