AP Records New 11,421 Positive Cases In Last 24 Hours - Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 11,421 కరోనా కేసులు

Jun 3 2021 4:48 PM | Updated on Jun 3 2021 5:21 PM

11421 New Coronavirus Positive Cases Recorded In AP - Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 86,223 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,421 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,25,682 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 81 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,2132కు చేరింది. గడిచిన 24 గంటల్లో 16,223 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 15 లక్షల 78 వేల 452 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

 ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,38,912 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,95,34,279 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement