జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. గాలివేగం తగ్గడంతో ఉక్కపోత పెరిగింది. గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం దిశగా గాలి వీచింది. | - | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. గాలివేగం తగ్గడంతో ఉక్కపోత పెరిగింది. గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం దిశగా గాలి వీచింది.

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

‘పుర’ పోరుకు

నేటి నుంచి నామినేషన్లు

● 18వ తేదీ వరకు స్వీకరణ

సాక్షి ప్రతినిధి, అనంతపురం: మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ఘట్టం నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం మునిసిపల్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతపురం నగర పాలక సంస్థతో పాటు గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుత్తి మునిసిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. చైర్‌పర్సన్‌, వార్డు స్థానాలకు వేర్వేరుగా నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దాఖలు చేయవచ్చు. చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ పదవులకు పోటీ చేసే జనరల్‌ అభ్యర్థులు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.1,500 చొప్పున డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement