ఆశలు అడియాసలు | - | Sakshi
Sakshi News home page

ఆశలు అడియాసలు

Aug 31 2026 1:50 AM | Updated on Aug 31 2026 1:50 AM

విడపనకల్లు: ఓ వైపు ఎల్‌–నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు హెచ్చెల్సీ ద్వారా గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ (జీబీసీ) కింద ఆయకట్టుకు నీరు వదలడం లేదు. ఈ పరిస్థితుల్లో విడపనకల్లు మండలం ఎన్‌.తిమ్మాపురం గ్రామానికి చెందిన హంపేష్‌ అనే రైతు బోరు కింద వస్తున్న అరకొర నీటితోనే నెలన్నర కిందట ఐదు ఎకరాల విస్తీర్ణంలో మిరప సాగు చేశాడు. అయితే ఇప్పుడు ఆ పంటకు విల్టు రోగం సోకింది. వైరస్‌తో మొక్క వాడిపోయి బూడిదరంగులోకి మారిపోవడం.. దిగుబడి గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉండటంతో చేసేది లేక రైతు ఆదివారం ట్రాక్టర్‌తో పంటను దున్నేశాడు. దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement