కిరాణా సరుకుల ధరలు చుక్కలు చూపుతున్నాయి. పంచదార కిలోపై రూ.30 పెరిగితే, పప్పు, ఉప్పు, బెల్లం, ఆయిల్ ఇతర వస్తువులన్నీ మండిపోతున్నాయి. మార్కెట్‌లో ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాట, బీన్స్ ఇలా ఏది చూసినా కిలో రూ.40 పైనా పలుకుతున్నాయి. ఇది సామాన్యులపై తీరని భారం పడుతుంది.
– పొరాళ్ల శివకుమార్, రాయదుర్గం
ధరలు నియంత్రించాలి
రూ.500 వెచ్చించినా కూరగాయలు బ్యాగు నిండని పరిస్థితి. సరైన వర్షాలు లేక కూరగాయలు ఆశించిన స్థాయిలో మార్కెట్‌కు రావడం లేదు. ఉల్లి అయితే కిలో రూ.70కి చేరింది. మిగిలిన సరుకుల ధరలు కూడా షాక్ కొడుతున్నాయి. ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
– శివశంకరమ్మ, బొమ్మనహాళ్


