పెళ్లికి హాజరైన చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

పెళ్లికి హాజరైన చంద్రబాబు

Aug 31 2026 1:50 AM | Updated on Aug 31 2026 1:50 AM

అనంతపురం టౌన్‌: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె విద్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు కుమారుడు శివరాజ్‌ల వివాహ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 2.30గంటలకు అనంతపురం శిల్పారామం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గన బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాలుకు చేరుకొని వధూవరులను ఆశ్వీరదించారు. పెళ్లి వేడుకల్లో సీఎంతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

హైకోర్టు రెగ్యులర్‌ బెంచ్‌ను ‘సీమ’లో ఏర్పాటు చేయాలి

అనంతపురం: హైకోర్టు రెగ్యులర్‌ బెంచ్‌ను రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఏపీ న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను అనంతపురం బార్‌ అసోసియేషన్‌ కోరింది. ఈ మేరకు బార్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రెసిడెంట్‌ గాజుల పద్మజ, జనరల్‌ సెక్రెటరీ, జేఏసీ కో కన్వీనర్‌ ఎన్‌.ఆదిశేషారెడ్డి ఆదివారం నంద్యాలలోని మంత్రి క్యాంప్‌ ఆఫీసులో కలిసి వినతిపత్రం అందజేశారు. హైకోర్టు రెగ్యులర్‌ బెంచ్‌ను కర్నూలులోని బీ క్యాంప్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

సజావుగా నీట్‌–పీజీ

అనంతపురం అర్బన్‌: జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ఆదివారం నీట్‌– పీజీ సజావుగా జరిగింది. 979 మంది అభ్యర్థులకు గాను 967 మంది హాజరయ్యారు. 12 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టబందోబస్తు నిర్వహించారు. వైద్య సదుపాయం, మౌలిక వసతులు అందబాటులో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement