సజావుగా రీ నీట్‌ | - | Sakshi
Sakshi News home page

సజావుగా రీ నీట్‌

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

హాజరు 88.58 శాతం నమోదు

3,508 మంది హాజరు,

492 మంది గైర్హాజరు

అనంతపురం అర్బన్‌: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఎన్‌ఈఈటీ) పునఃపరీక్ష సజావుగా జరిగింది. పరీక్ష నిర్వహణకు కటుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రబలగాలు బందోబస్తు నిర్వహించాయి. పరీక్షకు అభ్యర్థుల హాజరు 88.58 శాతంగా నమోదైంది. అనంతపురం నగర పరిధిలో 7 కేంద్రాలు, గుత్తి పట్టణ పరిధిలో రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు మొత్తం 3,960 మంది అభ్యర్థులకు గానూ 3,508 మంది హాజరుకాగా 452 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను, ప్రశ్నపత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ను కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పరీక్ష పకడ్బందీగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement