చేతికి రక్తపు మరక అంటకుండా.. నచ్చని వ్యక్తులను అంతం చేసే కుట్ర జరుగుతోంది. పోలీసుల భుజంపై గన్ను పెట్టి కాల్చే పరిస్థితి ఏర్పడింది. అనంతపురంలో దళిత విలేకరిపై దాడులు చేస్తే ఇప్పటి దాకా చర్యలు లేవు. ఈ సమాజంలో బతకాలంటే బరితెగించి పోరాడాల్సిన అవసరం ఉంది. పోలీసులు, పాలకులను వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కాపాడుకుందాం.
– సాకే హరి, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు


