విద్యార్థుల ఉన్నత చదువుకు ఊతమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఉన్నత చదువుకు ఊతమివ్వాలి

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

అనంతపురం టవర్‌క్లాక్‌ : చదువు ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమని ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగులకుంట నరేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పిల్లలకు చదువే నిజమైన ఆస్తి అని అన్నారు. ఆదివారం స్థానిక లలిత కళాపరిషత్‌లో ఏపీ రెడ్డి సంఘం, అఖిల భారత రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పదో తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన రెడ్డి కుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, నగదు బహుమతి, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా గంగులకుంట నరేష్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఏటా ఏపీ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను కేవలం ప్రసంసలతోనే కాకుండా వారి పైచదువులకు మరింత ఊతం ఇవ్వాలన్నారు. అందుకోసం సంఘం తరఫున రూ.5వేల నగదు అందించామన్నారు. దాదాసు 30 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశామన్నారు. రెడ్డి సంఘం ఎల్లప్పుడూ విద్యార్థుల ఉన్నతికి, సమాజ వికాసానికి తోడ్పాటునందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీరెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు పాటిల్‌ రామకృష్ణారెడ్డి, గౌరవాధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు మెడియం పాల రాజశేఖర్‌ రెడ్డి, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నితిన్‌ రెడ్డి, నగర అధ్యక్షుడు దయ్యం హనుమంత రెడ్డి, నాయకులు శివారెడ్డి, బీఎస్‌ఎన్‌ఎల్‌ రాజశేఖర్‌ రెడ్డి, సోమిరెడ్డి, రామోహన్‌ రెడ్డి, శ్రీరామిరెడ్డి, అలా మధుసూదన్‌ రెడ్డి, అరవింద రెడ్డి, సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement