నోటీసులిచ్చాం.. రికవరీ చేస్తాం | - | Sakshi
Sakshi News home page

నోటీసులిచ్చాం.. రికవరీ చేస్తాం

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

జిల్లాలోని అన్ని మండలాల్లో గత ఏడాది సామాజిక తనిఖీల నిమిత్తం గ్రామ సభలు నిర్వహించాం. రికవరీ కావాల్సిన మొత్తానికి సంబంధించి ఇప్పటికే కొందరు బాధ్యులకు నోటీసులిచ్చాం. రికవరీ అనేది నాలుగు రకాలుగా ఉంటుంది. ఆ మేరకు ఆయా మండలాల్లో గ్రామ సభలు నిర్వహించి నిధుల రికవరీ కోసం చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాసులు, జిల్లా విజిలెన్స్‌ అధికారి

సమగ్ర విచారణ చేపట్టాలి

ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు చోటు చేసుకోవడం దారుణం. అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి దుర్వినియోగమైన నిదులను అక్రమార్కుల నుంచి రాబట్టాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.

– కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి,

ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement