టన్ను మామిడి రూ.40 వేలు | - | Sakshi
Sakshi News home page

టన్ను మామిడి రూ.40 వేలు

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

అనంతపురం అగ్రికల్చర్‌: కక్కలపల్లి మార్కెట్‌లో గురువారం టన్ను మామిడికాయలు గరిష్టంగా రూ.40 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్‌ తెలిపారు. మార్కెట్‌కు 260 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.40 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.25 వేల ప్రకారం ధర పలికాయన్నారు. హిమాయత్‌ రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.35 వేలు, కనిష్టంగా రూ.10 వేలు, సరాసరిన రూ.20 వేల ప్రకారం అము్‌ుమడుబోయాయన్నారు. అలాగే తోతాపురి రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.23 వేలు, కనిష్టంగా రూ.10 వేలు, సరాసరిన రూ.15 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ వెల్లడించారు.

బాలుడి కిడ్నాప్‌కు యత్నం

అడ్డొచ్చిన తల్లిపై దాడి

కిడ్నాపర్లలో ఒకరికి దేహశుద్ధి

గుత్తి రూరల్‌: మండలంలో బాలుడి కిడ్నాప్‌ యత్నం జరిగింది. గ్రామస్తులు వెంబడించి ఓ కిడ్నాపర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం మార్నేపల్లి గ్రామంలోకి ముగ్గురు అపరిచిత వ్యక్తులు ప్రవేశించారు. గ్రామ శివారులో ఇంటి బయట ఆడుకుంటున్న నారాయణస్వామి, లలిత దంపతుల కుమారుడు హేమతేజ(2)ను ఎత్తుకుని ముందుకు కదిలారు. గమనించిన తల్లి లలిత కేకలు వేస్తూ పరుగున అక్కడికి చేరుకుని బాలుడిని లాక్కునేందుకు ప్రయత్నం చేసింది. అయితే అపరిచితుల్లో ఒకరు లలితపై దాడి చేసి గాయపరిచారు. అడ్డుకునేందుకు వచ్చిన వారిపై కూడా అతడు దాడి చేశారు. ఇంతలో స్థానికుల రావడం చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోగా.. ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. ఆ కిడ్నాపర్‌ను కట్టేసి దేహశుద్ధి చేశారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కిడ్నాప్‌యత్నం కలకలంతో గ్రామస్తులు భయాందోళన చెందారు.

ఆ కిడ్నాపర్‌కు మతిస్థిమితం లేదు

మార్నేపల్లిలో బాలుడి కిడ్నాప్‌కు యత్నించిన వ్యక్తి కిడ్నాపర్‌ కాదని, మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా గుర్తించామని సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్‌ వెల్లడించారు. గురువారం బాలుడి కిడ్నాప్‌కు యత్నించాడని గ్రామస్తులు పట్టుకున్న వ్యక్తిని స్టేషన్‌లో విచారించిన అనంతరం వారు మీడియాకు వివరాలు వెల్లడించారు. అతడు మతిస్థిమితం సరిగా లేక బాలుడిని ఎత్తుకున్నాడే కానీ కిడ్నాప్‌ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అతడిపై గతంలో ఎలాంటి కేసులు గాని నేర చరిత్ర లేదని టెక్నికల్‌ విచారణలో కూడా నిర్ధారణైందన్నారు. అతడి పేరు సుశాంత్‌ బర్నర్‌, మోతీహార్‌, బంగ్లా అని చెబుతున్నాడని అంతకు మించి ఏ వివరాలూ వెల్లడించే స్థితిలో లేడని సీఐ తెలిపారు.

పోలీసు స్టేషన్‌ ఎదుట బాహాబాహీ

అనంతపురం సెంట్రల్‌: నగరంలోని పాతూరులో విజయ క్లాత్‌సెంటర్‌ వద్ద టీడీపీ నేత, మాజీ కార్పొరేటర్‌ బాబా, షబ్బీర్‌ బాహాబాహీకి దిగారు. నగరపాలక సంస్థ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డును గురువారం షబ్బీర్‌ పరిశీలిస్తుండగా గమనించిన స్థానిక మాజీ కార్పొరేటర్‌ బాబా దుర్భాషలాడాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి పరస్పరం కొట్టుకున్నారు. అనంతరం వన్‌టౌన్‌ పోలీసులకు బాబా ఫిర్యాదు చేయడంతో షబ్బీర్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ఆ సమయంలోనూ పరస్పరం కొట్టుకుంటుండగా పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. ఘటనపై పరస్పర ఫిర్యాదులను పోలీసులు అందుకున్నారు. కేసు నమోదు చేయాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement