●వైభవంగా లంకాదహనం | - | Sakshi
Sakshi News home page

●వైభవంగా లంకాదహనం

Feb 28 2026 7:26 AM | Updated on Feb 28 2026 7:26 AM

●వైభవ

●వైభవంగా లంకాదహనం

ఉరవకొండ: గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం లంకాదహనం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. గవిమఠం పీఠాధిపతులు చెన్నబసవ రాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్‌ కరిబసవ రాజేంద్రస్వామి, మఠం సహాయ కమిషనర్‌ గంజి మల్లికార్జునప్రసాద్‌ లంకాదహనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆకాశంలో రంగురంగుల తారాజువ్వలు అందరినీ ఆకట్టుకున్నాయి.

అశ్వవాహనంపై విహరించిన

చంద్రమౌళీశ్వరుడు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, మహారుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విశేష పుషాల్పలతో అలంకరించిన అశ్వవాహనంపై ఉత్సవమూర్తిని కొలువుదీర్చి ఊరేగించారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి.

●వైభవంగా లంకాదహనం 1
1/1

●వైభవంగా లంకాదహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement