‘ఉపాధి’ నిధులు పక్కదారి!
రాయదుర్గం: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. క్షేత్ర సహాయకుల మస్టర్లలో మాయజాలం ప్రదర్శిస్తూ జేబులు నింపుకుంటున్న ఉదంతాలు ఎక్కువయ్యాయి. సామాజిక తనిఖీల్లోనూ ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలానే వెలుగుచూశాయి. ఏదో రూపంగా అక్రమాలు పుట్టుకొస్తున్నా.. అరికట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇన్నాళ్లు చాపకింద నీరులా దాగిన మరో అవినీతి బాగోతం బట్టబయలైంది. 2014–19 మధ్య కాలంలో జరిగిన పనులకు సంబంధించి (విత్‌హెల్డ్) చివరి బిల్లులు గతేడాది ఆగస్టులో విడుదలయ్యాయి. జిల్లాలో 16,045 వర్క్ ఐడీలకు సంబంధించి రూ.13.56 కోట్ల సర్దుబాటు జరిగింది. ఇందులో ఎక్కువగా సీసీరోడ్లు, డ్రెయినేజీలు, ఇతర పనులకు చెల్లించగా, ఉపాధి ద్వారా చేపట్టిన పండ్ల తోటల పెంపకం, మినీ గోకులం, బ్లాక్‌ప్లాంటేషన్, నాడెప్, సోప్ పిట్స్, డగౌట్ ఫాండ్స్, బౌండ్రీ ట్రెంచుల తదితర బిల్లులు జమయ్యాయి. ఇందులో అవినీతి అధికంగా జరిగినట్లు తెలుస్తోంది.
క్షేత్రసహాయకుల మస్టర్ల మాయాజాలం
లబ్ధిదారులకు మొండిచేయి
ఇతరుల ఖాతాలకు నిధుల జమ
కలెక్టర్ దృష్టి సారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి..


