● బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లికి చెందిన ఈ రైతు పేర
అనంతపురం అగ్రికల్చర్: అననుకూల వర్షాలు పంటలను దెబ్బతీశాయి. పెట్టుబడులు చేతికిరాక చితికిపోయిన రైతులకు వారి పిల్లల పెళ్లిళ్లు, చదువులు భారంగా పరిణమించాయి. చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీలు కూడా చెల్లించే స్తోమత లేక, ఆత్మాభిమానం చంపుకోలేక అర్ధంతరంగా తనువులు చాలిస్తున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచనిస్థితిలో ఉన్న బాధిత కుటుంబాలను చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకుండా కర్కశంగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఆత్మహత్య బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వకపోవడంతో రైతుల ఆత్మఘోషిస్తోంది. 2024లో 40 మంది, 2025లో 37 మంది వరకు రైతులు బలవన్మరణం చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 20 మంది రైతులను అర్హుల జాబితా నుంచి తొలగించేశారు. జాబితాలోని బాధితులకై నా పరిహారం ఇచ్చారా అంటే ఒక్కరికీ ఇవ్వలేదు.
రెండేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతులు వీరే..
చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన రెండేళ్లలో 77 మంది రైతులు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 2024 సంవత్సరంలో రైతులు మంజునాథ్ (కురాకులపల్లి), కార్తీక్ (బాలవెంకటాపురం), బి.రామదాసునాయక్ (కళ్యాణదుర్గం), జి.ఇంద్రసేనారెడ్డి (దంతలపల్లి), ఎ.వెంకటేశ్వర్లు (ఆమిద్యాల), నాగరాజు (యర్రగుంట్ల), పూసల కుళ్లాయప్ప (మల్లాగుండ్ల), పి.నరేష్ (పంపనూరు), అశోక్ (మర్తాడు), బెస్త ఎర్రిస్వామి (పెద్ద కౌకుంట్ల), ఎస్.జయలక్ష్మి (సలకంచెరువు), జొన్నగిరి మధుసూదన్ (వి.కొట్టాల), సి.శేఖర్ (కొర్రపాడు), సి.కుళ్లాయప్ప (బి.పప్పూరు), బి.రాజశేఖర్ (చింతలాంపల్లి), దండా సురేష్ (రాళ్ల అనంతపురం), జి.ఓబన్న (టి.వీరాపురం), చాకలి నాగన్న (నార్పల), బి.బాలక్రిష్ణ (ఉలికుంటపల్లి), కొడిమి ఓబులేసు (కందుకూరు), జి.వెంకటరాముడు (దయ్యాలకుంటపల్లి), వి.రాజశేఖర్‌రెడ్డి (పుట్లూరు), మజ్జిగ రామాంజినేయులు (శ్రీపురం), గోసుల మల్లికార్జున (మర్తాడు), వై.సంగప్ప (కడదరకుంట), సుంకర భాస్కర్ (నీలారెడ్డిపల్లి), పి.సంజీవ్‌కుమార్ (వెస్ట్ నరసాపురం), పి.పోలేరయ్య (కందుకూరు), మీసాల చిన్నవన్నూరప్ప (హావళిగి), మిద్దె గోపాలరెడ్డి (పులిప్రొద్దుటూరు), గుడిసి ప్రేమ్‌కుమార్ (కొనకొండ్ల) అర్ధంతరంగా తనువు చాలించారు.
● ఇక 2025 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో వి.నాగప్రసాద్ (వెంకటాంపల్లి), హరిజన నాగరాజు (గంగులాపురం), కె.శ్రీనివాసరెడ్డి (ముంటిమడుగు), పి.సదాశివరెడ్డి (ముకుందాపురం), ఎం.రాజశేఖర్ (నూతిమడుగు), పి.నాగరాజు (పొబ్బర్లపల్లి), కె.గంగప్ప (అపిలేపల్లి), గుండాల నాగలింగం (నెలగొండ), రాగే ఉమాదేవి (కోటంక), వై.శ్రీనివాసులు (బండార్లపల్లి), పి.రామాంజులరెడ్డి (బాలాపురం), బూదగవి రమేష్ (హావళిగి), కె.రామక్రిష్ణ (తుంబిగనూరు), సి.నారాయణ (గడ్డం నాగేపల్లి), జూటూరు రమేష్ (నాగసముద్రం), పుట్లూరు పెద్దిరెడ్డి (బాలాపురం), వి.లేపాక్షి (హావళిగి), వై.కుంటెన్న (పి.యాలేరు), ఎస్.స్వాతి (తోపుదుర్తి), కురుబ పోతన్న (యలగలవంక), కె.సుదర్శన్ (ఇల్లూరు), ఒ.మంజునాథరెడ్డి (నెరిమెట్ల), వెంకటేష్‌గౌడ్ (కురుబర హళ్లి), గోళ్ల రమేష్ (చాపిరి) ఉన్నారు.
జగన్ హయాంలో సత్వరమే ఎక్స్‌గ్రేషియా..
గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలకు సంబంధించి బాధిత కుటుంబాలకు సత్వరమే ఎక్స్‌గ్రేషియా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ వద్ద కార్పస్ ఫండ్ ఉంచడంతో పాటు నెల, రెండు నెలల్లోనే బాధితులకు న్యాయం జరిగేలా గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేశారు. రైతు ఆత్మహత్యలకు ఇస్తున్న రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను రూ.7 లక్షలకు పెంచారు. అలా గత ఐదేళ్లలో 280 మంది రైతులకు రూ.17.40 కోట్లు నేరుగా బాధిత కుటుంబాల ఖాతాల్లోకి జమ చేశారు. జమ చేసినట్లు ఎక్కడా అర్భాటం కూడా చేయకుండా న్యాయం చేశారు. 280 మంది బాధితుల్లో 110 మంది వరకు 2014–2018 మధ్యకాలం అంటే చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న వారే ఉండటం గమనార్హం. అప్పట్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా పెండింగ్ పెట్టి వెళ్లడంతో.. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించి ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకుంది.
2024లో ఆత్మహత్య
చేసుకున్న రైతులు
మంది
ఉసురు తీస్తున్న అప్పులు
గత రెండేళ్లలో 77 మంది బలవన్మరణం
రైతు కుటుంబాలను ఆదుకోని చంద్రబాబు సర్కార్
రోడ్డున పడుతున్న ఆత్మహత్య బాధిత కుటుంబాలు
40
● బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లికి చెందిన ఈ రైతు పేర


