ఉపాధ్యాయ ఖాళీల లెక్క తేలింది | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ ఖాళీల లెక్క తేలింది

Jan 13 2026 6:00 AM | Updated on Jan 13 2026 6:00 AM

ఉపాధ్యాయ ఖాళీల లెక్క తేలింది

ఉపాధ్యాయ ఖాళీల లెక్క తేలింది

అనంతపురం: డీఎస్సీ –2026లో భర్తీ చేయబోయే ఉపాధ్యాయ ఖాళీల లెక్క తేలింది. ఈ దఫా డీఎస్సీలో 252 పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నారు. డీఎస్సీకి సంబంధించి ఉపాధ్యాయ ఖాళీ స్థానాలను పరిశీలిస్తున్న విద్యా శాఖ అధికారులు.. ఖాళీల జాబితాను విద్యాశాఖకు పంపారు. డీఎస్సీ –2026లో ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలు ప్రాథమికంగా లెక్క తేలింది. స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు 23, హిందీ 37, ఇంగ్లిష్‌ 15, మేథమేటిక్స్‌ 16, ఉర్దూ 4, ఫిజికల్‌ సైన్సెస్‌ 10, ఫిజికల్‌ సైన్సెస్‌ (ఉర్దూ)– 4, ఫిజికల్‌ సైన్సెస్‌ (కన్నడ)–1, బయలాజికల్‌ సైన్సెస్‌ –15, బయలాజికల్‌ సైన్సెస్‌ (కన్నడ)–2, బయలాజికల్‌ సైన్సెస్‌ (ఉర్దూ)–5, సోషియల్‌ –18, సోషియల్‌ (ఉర్దూ)–4, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఉర్దూ)–2, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ –20, ఎంపీఎస్‌ హెడ్‌మాస్టర్‌/ స్కూల్‌ అసిస్టెంట్‌–20, ఎంపీఎస్‌ హెడ్‌మాస్టర్‌/ ఉర్దూ –1, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (స్కూల్‌ అసిస్టెంట్‌)– 5, ఎస్జీటీ (తెలుగు)– 43, ఎస్జీటీ (ఉర్దూ)–4, ఎస్జీటీ (కన్నడ)–3 .. మొత్తం –252 పోస్టులు డీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి వీలుగా ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. మొత్తం ఖాళీల్లో 792 పోస్టులు ఉండగా, 252 పోస్టులు డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. తక్కిన పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు.

ఎస్జీటీ అభ్యర్థులకు నిరాశ

డీఎస్సీలో సాధారణంగా ఎస్జీటీ అభ్యర్థులే ఎక్కువమంది ఉంటారు. తాజాగా నిర్వహించిన టెట్‌కు 17 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరిలో సింహభాగం ఎస్జీటీకి పోటీ పడేవారే. ఈ నేపథ్యంలో ఎస్జీటీ (తెలుగు) 43 పోస్టులు, ఎస్జీటీ (ఉర్దూ) –4, ఎస్జీటీ (కన్నడ)–3 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు మొత్తం 50 మాత్రమే ఖాళీలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో ఏళ్ల తరబడి కోచింగ్‌ తీసుకున్న వారికి నిరాశ కలిగిస్తోంది. ఎస్జీటీ పోస్టులకు దాదాపు 10 వేల నుంచి 12 వేల మంది రాస్తారు. ఈ నేపథ్యంలో భారీ పోటీ నెలకొంటోంది. ఖాళీల సంఖ్య పెంచి డీఎస్సీ – 2026 నిర్వహించాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.

డీఎస్సీ–2026 కోసం252 పోస్టుల భర్తీ

మొత్తం ఖాళీలు 792

ఇందులో 30 శాతం డీఎస్సీ ద్వారా భర్తీ !

ఎస్జీటీ 50 పోస్టులు మాత్రమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement