గట్టెక్కించేలా శిక్షణ తరగతులు
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వీలైనంతమంది విద్యార్థులు గట్టెక్కేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. నిర్దేశించిన తేదీల్లో కేటాయించిన సబ్జెక్టుల టీచర్లు హాజరై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. కనీస మార్కులతోనైనా పాస్ అయ్యేలా వారిలో నైపుణ్యాలు మెరుగు పరచాలి. రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక తరగతులు మే 18 వరకు కొనసాగుతాయి. ప్రతి మండలంలోనూ ఈ తరగతులు నిర్వహించాలి. ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే ఎంఈఓలు, హెచ్‌ఎంలను బాధ్యులుగా పరిగణించాల్సి వస్తుంది. – ఎం.ప్రసాద్‌బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి


