క్రికెట్ టోర్నీ విజేత ‘ఎస్‌ఎస్‌జీఎన్’
అనంతపురం కార్పొరేషన్: ఎస్కేయూ ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నీ విజేతగా గుంతకల్లు ఎస్‌ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాల జట్టు నిలిచింది. శనివారం అనంతపురం స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన ఫైనల్‌లో ఎస్‌ఎస్‌బీఎన్, ఎస్‌ఎస్‌జీఎన్ డిగ్రీ కళాశాల జట్లు పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఎస్‌జీఎన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అనంతరం ఎస్‌ఎస్‌బీఎన్ జట్టు 109 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. విజేతలకు ఎస్కేయూ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో ఎస్కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి జెస్సీ, ఎస్‌వీ డిగ్రీ కళాశాల వైస్ చైర్మన్ చక్రధర రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్‌ఎవీ ప్రసాద్, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆటో బోల్తా.. బాలుడి మృతి
కూడేరు: ఆటో బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని జల్లిపల్లిలో జరిగింది. వివరాలు... జల్లిపల్లికి చెందిన సాయినాథ్ గౌడ్, రాజేశ్వరి కుమారుడు ఉదయ్ కిరణ్ (13) కూడేరులోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయ్ కిరణ్ తన తాతతో కలిసి ఆటో నడిపేందుకు యత్నించగా అదుపు తప్పి బోల్తా పడింది. బాలుడు ఆటో కింద పడి గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.


