ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థుల సత్తా
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సత్తా చాటారు. ఇటీవల కళాశాలలో యాక్సెంచర్ సంస్థ ప్రతినిధులు క్యాంపస్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో కళాశాలకు చెందిన 38 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి రూ.4.25 లక్షల ప్యాకేజీ ప్రకటించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలక్రిష్ణ తెలిపారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని, కళాశాలలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుండడమే ఇందుకు కారణమన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులను శనివారం కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్‌రెడ్డి అభినందించారు.


