కణేకల్లు మండల కేంద్రంలో ఆదివారం చిక్కణ్ణేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది. రథోత్సవాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్తులతో కణేకల్లులో సందడి నెలకొంది. ‘చిక్కణ్ణేశ్వరా.. శరణు’ అంటూ భక్తులు చేసిన ఘోషతో పురవీధులు మార్మోగాయి. స్వామి వారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఆశీనులు గావించి ఉత్సవం ప్రారంభించారు. రథోత్సవం సాగుతున్నంత సేపూ శివన్నామస్మరణ చేసుకుంటూ భక్తులు తన్మయత్వం చెందారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. – కణేకల్లు:
●వైభవం.. చిక్కణ్ణేశ్వరుడి రథోత్సవం


