‘అనంత’లో జోయాలుక్కాస్ షోరూం ప్రారంభం
● ప్రదర్శనలో 150 కేజీల బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాలు
అనంతపురం కార్పొరేషన్: బంగారు, వజ్రాభరణాల అతి పెద్ద షోరూంల్లో ఒక్కటైన జోయాలూక్కాస్... అనంతపురంలోని రాజు రోడ్డులో తన నూతన బ్రాంచ్‌ను శుక్రవారం ప్రారంభించింది. జోయాలుక్కాస్ గ్రూప్ ఆఫ్ ఛైర్మన్, ఎండీ జాయ్ అలూక్కాస్‌తో కలసి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూరరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన జోయాలుక్కాస్ షోరూంను జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జోయాలుక్కాస్ ఎండీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 175 షోరూంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తక్కువ బరువుతో ఉన్న ప్రపంచ స్థాయి మోడల్స్‌తో డైమండ్, గోల్డ్, సిల్వర్ జ్యువెలరీను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అనుగ్రహ టెంపుల్ జ్యువెలరీ, ప్రైడ్ డైమండ్స్, ఎలిగంజా పోల్కి డైమండ్స్, యవ ఎన్విరిడే జ్యువెలరీ, అపూర్వ యాంటిక్ కలెక్షన్, రత్న ప్రెషన్ స్టోన్ జ్యూవెలరీ తదితర 150 కిలోల ఆభరణాలను ప్రదర్శనలో ఉంచామన్నారు. తమ ఉత్పత్తులకు రిటర్న్ విలువ ఉంటుందన్నారు.


