పూలే ఆశయాలు కొనసాగించాలి
అనంతపురం సిటీ: మహాత్మ జ్యోతిబా పూలే ఆశయలు కొనసాగించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ క్యాంపస్‌లో గల ఆయన విగ్రహానికి శుక్రవారం మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కలెక్టర్ వినోద్‌కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఆర్డీఓ గుత్తా కేశవనాయుడు, బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి, డీటీడబ్ల్యూఓ బోయ రామాంజనేయులు పాల్గొన్నారు.
అనంతపురం అర్బన్: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూభవన్‌లో నిర్వహించిన జ్యోతిబా పూలే జయంతిలో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ వినోద్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై నివాళులర్పించారు.


