అనంతపురం కార్పొరేషన్: పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానం ద్వారా పేదలకు వైద్య సేవలు శాశ్వతంగా దూరమవుతాయని, ఈ విధానం కింద ప్రభుత్వ ఆస్పత్రులను చేర్చే ఆలోచనను మానుకోకపోతే ఉద్యమిస్తామంటూ కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ హెచ్చరించారు. పీపీపీ పద్ధతిని వ్యతిరేకిస్తూ ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధికంగా పేదలకు సర్వజనాస్పత్రినే దిక్కుగా మారిందన్నారు. ప్రైవేట్ కంపెనీలను భాగస్వామ్యం చేసుకుంటే పేదలకు నాణ్యమైన వైద్యం అందదన్నారు. హెల్త్ కేర్ సెక్టార్‌కు సంబంధించి బడ్జెట్‌లో 5 శాతం నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రసూన, డాక్టర్ వీరభద్రయ్య, నాయకులు రాజు, తిరుపాల్, చంద్రశేఖర్, సురేంద్ర, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
సింహ వాహనంపై రంగనాథుడు
తాడిపత్రి: ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి సింహ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. రంగనాథస్వామిని ప్రత్యేక పూలు, ఆభరణాలతో అర్చకులు అలంకరించారు. రాత్రి సింహ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.
‘పీపీపీ’తో పేదలకు వైద్య సేవలు దూరం


