●ఓ పనైపోయింది బాబు
యాహూ..: అనంతపురంలోని
ఓ సెంటర్ వద్ద పరీక్ష ముగిసిన
ఆనందంలో విద్యార్థులు
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు ముగిశాయి. మార్చి 17న ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏడాదంతా కష్టపడి చదివి తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. చివరిరోజు మంగళవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు మొత్తం 31,200 మంది విద్యార్థులకు గాను 30,800 మంది హాజరయ్యారు. 400 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్రాల వద్ద కేరింతలు..
సాంఘిక శాస్త్రం పరీక్ష ముగియగానే విద్యార్థులు కేరింతలు కొట్టారు. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో చదువుతున్న వారు ఊళ్లకు బయలుదేరి వెళ్లారు.
●ఓ పనైపోయింది బాబు


