
సీఎం కాన్ఫరెన్స్‌లో కలెక్టర్
అనంతపురం అర్బన్: విజయవాడలోని సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన పలు అంశాలను ఈ సందర్భంగా సీఎంకు కలెక్టర్ వివరించనున్నట్లు సమాచారం.
రైతు విశిష్ట గుర్తింపు
సంఖ్య నమోదు తప్పనిసరి
గార్లదిన్నె: రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య (ఏపీఎఫ్‌ఆర్) నమోదు తప్పనిసరి అని రైతులకు జేడీఏ ఉమామహేశ్వరమ్మ సూచించారు. గార్లదిన్నె మండలం యర్రగుంట్ల, మర్తాడు, గార్లదిన్నె రైతు సేవా కేంద్రాల్లో చేపట్టిన ఏపీఎఫ్‌ఆర్ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ఆమె పరిశీలించి, మాట్లాడారు. మండల వ్యాప్తంగా 11 వేల మంది రైతులు ఇప్పటి వరకూ ఏపీఎఫ్‌ఆర్ నమోదు చేసుకున్నారన్నారు. ఈ విశిష్ట సంఖ్య ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హత ఉంటుందన్నారు. ఏపీఎఫ్‌ఆర్ నమోదు చేసుకోని రైతులు ఆయా గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సోమశేఖర్, రైతులు పాల్గొన్నారు.
డీఎస్సీ శిక్షణకు
దరఖాస్తు చేసుకోండి
అనంతపురం రూరల్: ఆన్‌లైన్ ద్వారా అందించే డీఎస్సీ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఉప సంచాలకులు సుమన జయంతి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెట్‌లో అర్హత సాధించిన జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. టెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు 08554 275575లో సంప్రదించవచ్చు.

సీఎం కాన్ఫరెన్స్‌లో కలెక్టర్