
అశ్వవాహనంపై బుగ్గరామలింగేశ్వరస్వామి
తాడిపత్రి టౌన్: బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు మంగళవారం రాత్రి బుగ్గరామలింగేశ్వరస్వామి అశ్వవాహనంపై విహరించారు. పార్వతీ సమేత బుగ్గరామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం పురవీధుల్లో అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, వాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.