ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ప్రియురాలి మృతి | lovers attempted suicide, girl died | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ప్రియురాలి మృతి

Sep 22 2016 12:17 PM | Updated on Nov 6 2018 8:04 PM

మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం తాడిపర్తిలో గురువారం విషాదం చోటు చేసుకుంది.

మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం తాడిపర్తిలో గురువారం విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా.. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. తాడిపర్తి గ్రామానికి చెందిన వారు ఈ విషయాన్ని గమనించి... యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యవతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement