మలేరియా నివారణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

మలేరియా నివారణకు పటిష్ట చర్యలు

Nov 29 2026 2:17 PM | Updated on Nov 29 2026 2:17 PM

జోన్‌–1 జోనల్‌ మలేరియా అధికారి ప్రభావతి

దేవరాపల్లి/కె.కోటపాడు: మలేరియా నియంత్రణకు నిత్యం అప్రమత్తంగా ఉంటూ నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జోన్‌–1 జోనల్‌ మలేరియా అధికారి (జెడ్‌ఎంవో) డాక్టరు బి. ప్రభావతి సూచించారు. దేవరాపల్లి పీహెచ్‌సీతో పాటు కె.కోటపాడు మండలం లంకవానిపాలెం పీహెచ్‌సీని శనివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్‌సీ పరిధిలో ఇప్పటి వరకు నమోదైన మలేరియా, ఇతర జ్వరాల వివరాలను స్థానిక వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడు తూ మలేరియా, డెంగ్యూ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతీ శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. లార్వా వృద్ధి చెందకుండా నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తపడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తల స్థాయిలో యాక్టివ్‌ ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది దేవరాపల్లి పీహెచ్‌సీ పరిధిలో 46 ఫీవర్‌ కేసులు నమోదయ్యాయని, రెండు నెలలుగా జ్వరాల కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. మలేరియా కేసులను గుర్తించేందుకు మాస్‌ సర్వే నిర్వహిస్తున్నామని, ఒక పాజిటివ్‌ కేసు నమోదైన ప్రాంతంలో సంబంధిత వ్యక్తి ఇంటి చుట్టు పక్కల 50 ఇళ్లలో ప్రత్యేకంగా సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. దోమల నివారణకు పిచికారీతో పాటు ఇతరత్రా నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. జోన్‌ –1 పరిధిలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజ్యు జిల్లాలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతుండగా, అనకాపల్లి జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. యాంటీమలాజికల్‌ టీం, వైద్యాధికారి శైలజ, ఆదిత్య, ఎంపీహెచ్‌ఈవో శంకరరావు, హెచ్‌.ఎస్‌.హిక్సియా, హెల్త్‌ అసిస్టెంట్‌ త్రినాథ్‌, ల్యాబ్‌ టెక్నీషియ న్లు మహేష్‌, ఉన్నీషా బేగం, శ్రీదేవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement