ప్రయాణికుల సేవలో సక్రమంగా విధులు | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల సేవలో సక్రమంగా విధులు

Nov 29 2026 2:17 PM | Updated on Nov 29 2026 2:17 PM

అనకాపల్లి : ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహించాలని ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) జిల్లా అధికారి వి.ప్రవీణ అన్నా రు. స్థానిక జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బందితో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్సు సిబ్బంది ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. బస్సు ఆపలేదనే ఫిర్యాదు కు తావులేకుండా ప్రయాణికులను బస్సు ఎక్కించుకుని వారి ని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని కోరారు. బస్‌ స్టాప్‌ లోను ప్లాట్‌ఫారాలు మీద బస్సులు పెట్టేటప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, డ్రైవర్లు బస్సు రివర్స్‌ చేసేటప్పుడు కండక్టర్‌ వెనక్కి వెళ్లి చూడాలని, అందరూ ఎక్కిన తర్వాతే బస్సు ముందుకు నడపాలని, ఫుట్‌పాత్‌ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆమె కోరారు. కార్తీక మాసం పిక్నిక్‌లకు, తీర్థయాత్రలకు, దేవాలయాలకు ఉచిత బస్సు ప్రయాణికులు ఎక్కువగా వస్తుంటారని రద్దీ ఉన్నప్పటికీ సక్రమంగా సేవలందించాలన్నారు. ప్రయాణికులకు ఆర్టీసీపై సాను భూతి పెరగాలన్నారు. రహదారి ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్లు, ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చే సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి, నర్సీపట్నం డిపో మేనేజర్లు రాజేశ్వరి,ఆచారి, సిబ్బంది పాల్గొన్నారు.

సిబ్బందికి ఆర్టీసీ జిల్లా అధికారిప్రవీణ సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement