మున్సిపల్‌ అధికారులూ స్పందించండి..! | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ అధికారులూ స్పందించండి..!

Sep 1 2026 1:01 AM | Updated on Sep 1 2026 1:01 AM

● మురుగు సమస్యపై ఓ వృద్ధుడి దీక్ష

నర్సీపట్నం : మున్సిపల్‌ అధికారుల తీరును నిరసిస్తూ మున్సిపాలిటీ బ్యాంక్‌ కాలనీకి చెందిన ఎస్‌.సూర్యనారాయణరాజు ఆర్డీవో కార్యాలయం ఎదుట అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తన ఇంటికి అనుకొని ఉన్న ఖాళీ స్థలంలో మురుగు నీరు నిలిచిపోవటం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నాం తెలిపారు. దుర్వాసన, దోమలు, బోరు నీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మున్సిపల్‌ అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లినా స్పందన లేదని, ఫిర్యాదు చేసిన తననే అధికారులు హెచ్చరిస్తున్నారని ఆవేదన చెందారు. సమస్య పరిష్కరించే వరకు దీక్ష విరమించే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement