అప్పలరాజుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
నెహ్రూచౌక్ వద్ద ధర్నా చేస్తున్న రైతు సంఘాల నాయకులు
అనకాపల్లి: రైతు సంఘం జిల్లా నాయకుడు ఎం.అప్పలరాజుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, వెంటనే విడుదల చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ కర్రి అప్పారావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరావు డిమాండ్ చేశారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద అఖిలపక్ష నాయకులు, రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా రైతు నాయకుడు ఎం.అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ యాక్ట్ నమోదు చేసి జైలులో పెట్టిందని ఆరోపించారు. గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన పీడీ యాక్ట్‌ను రైతు నాయకుడిపై ప్రయోగించడం అన్యాయ మన్నారు. విశాఖలో విద్యార్థి సంఘాల కార్యకర్తలపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం తగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు, గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్, ఏఐటీయూ జిల్లా నాయకుడు రాజాన దొరబాబు, వివిధ సంఘాల నాయకులు గండి నాయనబాబు, ఆర్.శంకరరావు, డి.డి. వరలక్ష్మి, ఎస్. బ్రహ్మాజీ, ఆర్.రాజు, ఎస్.వి.నాయుడు, కాండ్రేగుల సదా శివరావు, కాళ్ల తాళయ్య బాబు, నాగిరెడ్డి సత్యనారాయణ, సుభాషిణి, ఎ.రాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


