ఉత్సాహంగా జిల్లాస్థాయి చెస్‌ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా జిల్లాస్థాయి చెస్‌ టోర్నమెంట్‌

Jan 12 2026 7:21 AM | Updated on Jan 12 2026 7:21 AM

ఉత్సాహంగా జిల్లాస్థాయి చెస్‌ టోర్నమెంట్‌

ఉత్సాహంగా జిల్లాస్థాయి చెస్‌ టోర్నమెంట్‌

మాకవరపాలెం: జిల్లాస్థాయి చెస్‌ టోర్నమెంట్‌ ఉత్సాహంగా సాగింది. స్థానిక గ్రంథాలయంలో ఆదివారం ప్రగతి చెస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, గౌతమి లలితకళా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెస్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కశింకోట మండలానికి చెందిన ప్రసాద్‌ ప్రథమ, మాకవరపాలెం గ్రామానికి చెందిన గౌరీశంకర్‌ ద్వితీయ, తామరం గ్రామానికి చెందిన ప్రభవ్‌ తృతీయ స్థానాలు సాధించారు. వీరికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లలితకళా శిక్షణ కేంద్రం కార్యదర్శి శేషగిరిరావు, సుధీర్‌, ఆదినారాయణ, సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement