కిరాణా షాపు దగ్ధం
దగ్ధమైన కిరాణా షాపులో సామగ్రి
అచ్యుతాపురం రూరల్: మండల కేంద్రం అచ్యుతాపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సమీపంలో గల ఓ కిరాణాషాప్ ఆదివారం వేకువజామున దగ్ధమైంది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా భోగాపురం గ్రామానికి చెందిన బొడ్డు కుమారికి చెందిన షాపు కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. అయితే ఈ ప్రమాదంపై కుమారి అనుమానం వ్యక్తం చేసింది. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి తన షాపు ఎదుట సంచరించాడని, సీపీ ఫుటేజీ లో గుర్తించామని తెలిపింది. కౌంటర్ సొరుగు లో రూ.5వేల నగదు ఉంచానని, సొరుగుతో సహా నగదు కనిపించలేదని చెప్పింది. ఈ ప్ర మాదంలో షాపులో ఉన్న రూ.2.50లక్షల విలు వైనసామగ్రి దగ్ధమైనట్టు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆమె తెలిపింది.


